ISSUE 1 Milestones 00 Foreword by Dr. Kavita Karki 00 From the POV of Grade 7 00 Student Write-Ups 00 Student Creations
FOREWORD
HINDI AN YEAR OF HINDI
Discussing Hindi revision - MT. KAILASH Hindi teacher checking our Hindi website! - MT. KAILASH
HINDI AN YEAR OF HINDI
Telugu DELHI : OUR CAPITAL ప్రతి పర్యాటకునికి తన పర్యటన జీవితంలో మరిచి పోలేని తీపి అనుభవాలను కలిగిస్తుంది . ఆలా నాకు తీపి అనుభవాలను ఇచ్చిన పర్యటన నా పుట్టి న రోజు సందర్బంగా విహరించిన ఢీల్లీ యాత్ర .మన దేశ రాజధాని ఢీల్లీ పర్యటన ఎంతో అద్భుతంగా కొనసాగింది.ఇది ఒక పెద్ద నగరం మాత్రమే కాదు , దాని వెలుగు జిలుగులతో ఆధునికత మరియు సంప్రదాయతలకు ప్రతీకగా నిలిచి ఉంటుంది. నేను ఢీల్లీలో సందర్శించిన ముఖ్యమయిన ప్రదేశాలు కుతుబ్ మినార్ ,లోటస్ టెంపుల్ ,ఇండియా గేట్ ,రెడ్ ఫోర్ట్ ,ఇంకా రాష్ట్రపతి భావం . కుతుబ్ మినార్ ఇండోఇస్లా మి నిర్మాణాలకు ఒక అపురూపమైన ఉదాహరణ . ఇది ప్రపంచంలోనే ఎతైన ఇటుకలతో నిర్మించబడింది , ఇది యునెస్కో వారిచే గుర్తింపు బడింది . కుతుబుద్దీన్ ఐబక్ 1193 లో దీనిని నిర్మించారు . దీని ఎత్తు 72 .5 మీటర్లు . మేము దీన్ని రాత్రి వెలుగులో సందర్శించాము . దీనిని మీరు కుడా చీకటి వెలుగు కాంతులలో సందర్శిస్తే కనులకు ఎంతో ఆహ్లా దంగా ఉంటుంది . న్యూ ఢీల్లీలో చూడవలసిన ప్రదేశాలలో ఇండియా గేట్ ఒకటి . దీనిని మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు ఆఫ్ఘన్ యుద్ధసమయంలో అమరులైన 90 ,000 మంది జవాన్ల జ్ఞపకార్థం ఈ స్మ్రుతి చిహ్నాన్ని కట్టా రు . దీని పరిసరాలు చూడటానికి పచ్చని చెట్ల తో ఎంతో ముచ్చటగా ఉంటాయి . ఇక్కడ నుంచి నేరుగా రాష్ట్రపతి భావం చూడటం మరుపురాని అనుభూతిని ఇస్తుంది . నగరం లో మరొక ఆకర్షణీయ స్థలం లోటస్ టెంపుల్ , ఇది ఒక బహాయి ప్రా ర్థనా మందిరం . దీని పుష్పం వంటి ఆకారం బాగా గుర్తింపు పొందింది .ఇది ఎన్నో నిర్మాణ అవార్డు లను గెలుచుకుంది . మరొక తప్పకుండ చూడవలసిన అద్భుతమైన కట్ట డాల్లో ఎర్రకోట ఒకటి .ఇది ప్రపంచ వారసత్వ సంపద .దీనిని షాజహాన్ కట్టించారు .ఇది యమునా నది ఒడ్డు న ,మొత్తం 120 ఎకరాల సువిశాల స్థలంలో పర్షియా నుంచి రప్పించిన నిపుణులతో కట్టించారు .ఇక్కడ స్వతంత్ర దినోత్సవ సందర్బంగా మన దేశ ప్రధానమంత్రి జండాను ఎగురవేస్తా రు .రిపబ్లి క్ డే వేడుకలు ఎంతో అద్భుతంగా జెరుగుతాయి . మరో నిర్మాణం రాష్ట్రపతి భవనంలో మన దెస రాష్ట్రమంత్రి నివసిస్తా రు . ఈ భవనము యొక్క ఆవరణ ఎంతో అందమైన ఉద్యానవనాలతో నిండి ఉంటుంది .ఈ ఆవరణలో ముఘల్ గార్డెన్ ,హెర్బల్ గార్డెన్,నూట్రిసియాన్ గార్డెన్ ,ఇంకా స్పిరిట్యుయల్ గార్డెన్ వంటివి ఉన్నాయి . ఎలా చూడటానికి కనువిందుగా ఎన్నో ప్రదేశాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఢిల్లీ నగరం . మీరు తప్పకుండ వచ్చి ఢిల్లీ నగరాన్ని చూడండి .
Telugu SWAMI VIVEKANANDA భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన స్వామి వివేకానంద. తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రా లను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు.. ఆ వాగ్దా టి.. ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టి న మొదటి హిందూ సన్యాసి కూడా వివేకానందనే కావడం విశేషం. అందుకే ఆయన సేవలను స్మరిస్తూ భారత ప్రభుత్వం వివేకానంద జన్మదినాన్ని 'జాతీయ యువజన దినోత్సవం'గా జరుపుతోంది. స్వామివివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా . పశ్చిమబెంగాల్‌లోని కోల్క తాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా , భువనేశ్వరి దంపతులకు జన్మించాడు. బాల్యం నుంచే ఆటలలోనూ, చదువులోనూ చురుగ్గా ఉండేవాడు. ఏకసంథాగ్రా హిగా పేరు తెచ్చుకున్న వివేకానంద జ్ఞా పకశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణు డై.. ఆ తర్వాత తత్వశాస్త్రం,పాశ్చాత్య శాస్త్రా లను అభ్యసించాడు. సత్యాన్వేషణ కోసం చేస్తు న్న ప్రయత్నంలో ఒకసారి నరేంద్రు డు తన స్నేహితులతో కలిసి దక్షిణేశ్వర్ల ోని రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్లా డు. అక్కడ ఆయన ప్రసంగాలను శ్రద్దగా ఆలకించాడు. ఆ సమయంలో రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రు డిపై పడింది. నరేంద్రు డిని చూసి పరమహంస తెలియని తాద్యాత్మతకు లోనయ్యాడు. ఆ తర్వాతి కాలంలో పరమహంస శిశ్యుడిగా మారిపోయిన నరేంద్రు డు నెమ్మదిగా ప్రా పంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసిగా.. వివేకానందుడిగా మారిపోయాడు. ఆయన బోధనలు దేశంలో ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తు న్నాయి. స్వామి వివేకానంద పేరు చెప్పగానే 125 ఏళ్ల క్రితం చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో ఆయన చేసిన అనితరసాధ్యమైన ప్రసంగం గుర్తు కు వస్తుంది. ముందస్తు సిద్ధం చేసిన ప్రసంగపాఠం లేకుండా...అమెరికా దేశపు ప్రియ సహోదరులారా అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టి నప్పుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్ల తో మహాసభ దద్దరిల్లిపోయిన ఘట్టం చిరస్మరణీయం. ఆంగ్లం ఆయన చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నీరాజనాలు పట్టింది. గొప్ప ఉపన్యాసకుడైన స్వామి వివేకానందను ఆకాలంలో ‘లైట్నింగ్ ఆరేటర్’ అని పిలిచేవారు. చికాగోలో ఆయన తొలి ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచ దేశాలంతట ప్రతి ధ్వనిస్తోంది. - Srimayi Oruganti, 7th Kamet
Telugu ప్రేమ లోకం లో మన తొలి ప్రేమ అమ్మ తొలి నమ్మకం అమ్మ మన సంతోషం తన సంతోషంగా మన బాధ తన బాధగా భావించేది అమ్మ మన తొలి స్నేహితురాలు మన తొలి గురువు అమ్మ అన్ని నా కోసం చేసిన మా అమ్మకి ఏమి ఇవ్వగలను. నా ప్రేమను పంచగలను. లోకంలో తల్లు లందరికీ వందనం ధన్యవాదాలు - Greeshma Nitturu, 7th Dhaulagiri
Telugu 90 YEAR OLD TELUGU FILM చలన చిత్రం అనేది రెండు పదాలు కలిపి ఉన్నది. చలన అంటే కదిలేది అని , చిత్రం అంటే బొమ్మ . చలన చిత్రం అంటే \"కదిలే బొమ్మ\"అని అర్థం . తెలుగులో మొట్ట మొదటి చిత్రం \" భక్త ప్రహ్లా ద \" , దానిని 1932 లో నిర్మించారు. ఈ సినిమాను పూర్తి ధ్వని చిత్రంగా విడుదల చేశారు . ఈ చిత్రంను \"హెచ్ . ఎం రెడ్డిగారు నిర్మించారు . ఫిబ్రవరి 6 న ఈ చిత్రం తొలిసారిగా థియేటర్లు లో విడుదల అయింది. ఇవాళ సమాజం లో ప్రజలమీద అమితంగా ప్రభావితం చేస్తు న్నది అంటే సందేహమే లేదు , అది సినిమా మాత్రమే. కొన్ని యేళ్ళ క్రితం టాకీల రాక ముందు ప్రపంచ వ్యాప్తంగా భాషలతో ప్రమేయం లేకుండా మూగ చిత్రా లు వచ్చాయి. అలా మొదలైన మన సినిమా 90 ఏళ్ళు దాటి ఎంతో ముందుకి సాగింది. వేలరూపాయిలతో మొదలైన సినిమా నిర్మాణం ఇపుడు హంగులు హంగామాలతో వందల కోట్ల రూపాయిలు పెట్టు బడులతో నిర్మిస్తు న్నారు. సినిమా వలన ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఒక్క సినిమా తీయడానికి వందల మంది టెక్నిషియన్లు అవసరం. వారి అందరికి సినిమా వలన ఉపాధి కలుగుతున్నది. సినిమా అనేది మనస్సుకు ప్రశాంతంగా , ఆహ్లా దంగా ఉండానికి దోహదం చెయ్యాలి కానీ ఇతరులను విమర్శించే విధంగా, కించపరిచే విధంగా, భావోద్వాగాలును కలుగజేసేదిగా ఉండకూడదు. కూటి కోసం కోటి విద్యలు నేర్పే \"ఆకలి గొప్పది\". ఎంతో మంది కడుపులు నింపి ఆకలి తీరుస్తు న్న \"సినిమా గొప్పది\". - Dhruthi Balla, VII Dhaulagiri
Telugu Ramleela Celebrations - Satya Bhuvanesh Varanasi, VII Kamet
Telugu OUR TELUGU LANGUAGE మన తెలుగు భాషకు చాలా ప్రా ముఖ్యత ఉంది. తేనె వంటి తియ్యనిది మన తెలుగు భాష. మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే \"ప్రపంచ ఉత్తమ లిపిలలో రెండవ ఉత్తమ లిపిగా\" మన తెలుగు \"లిపి\" ఉండడం మన తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం. \"దేశభాష లందు తెలుగు లెస్స\" అన్నారు శ్రీ కృష్ణ దేవరాయలు. \"చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు\" మన తెలుగు. అంతటి అద్భుతమైన తెలుగుభాషలో ఎన్నో శాస్త్రా లు, వేదాలు, ఉపనిషత్తు లు, ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాలు, గ్రంధాల సమాహారం మన తెలుగు!! ఆచార సంప్రదాయాలలో పరదేశీయులు దగ్గర ఎనలేని విలువ తెచ్చిపెట్టింది. \"పుడమి జడలో పరిమళ పదకుసుమం\" మన తెలుగు.\"విశాల జగత్తు లో ప్రశాంత \"భావసంద్రం\" మన తెలుగు. ఇటువంటి మన తెలుగు భాషను గౌరవిద్దాం. - VANSHIKA TATIKAYALA, GRADE 7 DHAULAGIRI
French THE LANGUAGE OF LOVE Bonjour à tous, Je m'appelle Ipshita et je suis vraiment contente d'avoir pris ma 3ème langue comme français. Apprendre le français c'est avant tout le plaisir d'apprendre une belle langue riche et mélodieuse que l'on appelle souvent la langue de l'amour. Le français est aussi une langue d'analyse qui structure la pensée et développe l'esprit critique, ce qui est une compétence précieuse pour les discussions et les négociations. J'apprends le français depuis 3 ans et cette expérience est absolument incroyable. C'était un sujet pour lequel j'étais au moins engagé dans chaque nouvelle tâche avec vigueur et exubérance. Apprendre une langue étrangère est difficile, mais tout cela n'a été possible que grâce à nos professeurs interactifs qui nous ont vraiment soutenus et déterminés à nous enseigner. C'est ma première année à l'ISAP et j'ai réalisé que l'enseignement du français est une façon de stimuler intellectuellement nos esprits. J’attends avec impatience plus de telles façons d'apprendre et plus d'enseignants encourageants. Translation: Hello everyone, My name is Ipshita, and I'm delighted to have taken my 3rd language as French. Learning French is, above all, the pleasure of learning a beautiful, rich, and melodious language that is often called the language of love. French is also an analytical language that structures thought and develops critical thinking, a valuable skill for discussions and negotiations. I have been learning French for three years, and the experience is fantastic. It was a subject for which I was fully engaged in each new task with vigor and exuberance. Learning a foreign language is difficult, but all of this was only possible thanks to our interactive teachers, who were supportive and determined to teach us. This is my first year at ISAP, and I have realized that teaching French is a way to stimulate our minds intellectually. I look forward to more such forms of learning and more encouraging teachers. - Ipshita Guha, Grade 7 - Makalu
Search
Read the Text Version
- 1 - 13
Pages: